టాలీవుడ్ సీనియర్ నటులు చలపతిరావు (Chalapathi Rao) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. చలపతిరావు (78) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చలపతిరావు మృతి పట్ల ఆయన కుటుంబసభ్యులకు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు.
కాగా ఇవాళ చలపతిరావు 11వరోజు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హాజరయ్యారు. ఆయన చలపతిరావు చిత్రపటంపై పూలు చల్లి నివాళులర్పించారు. చలపతిరావు కుటుంబసభ్యులను ఓదార్చారు.
చలపతిరావు కెరీర్లో 600కిపైగా చిత్రాల్లో నటించారు. యమగోల, ఆదిత్య 369, ఆ నలుగురు, ఆది, చెన్నకేశవరెడ్డి సినిమాలతోపాటు మరెన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు చలపతిరావు .
Nandamuri Balakrishna With #ChalapathiRao Gari Family 11th Day Ceremony 🙏🏻 #NBK #RaviBabu pic.twitter.com/xyJK3U4jhA
— Vamsi Krishna Kagitha (@VamsiKKagitha) January 3, 2023