కృష్ణ, వ్రిందల ప్రేమాయణం
నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంలో షెర్లీ సెటియా నాయికగా నటిస్తున్నది. ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఉషా ముల్పూరి నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల
నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంలో షెర్లీ సెటియా నాయికగా నటిస్తున్నది. ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఉషా ముల్పూరి నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు అనిల్ రావిపూడి టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘ఐరా క్రియేషన్స్ మంచి సినిమాలు చేయాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. టీజర్ బాగుంది. నాగశౌర్య కష్టపడి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో అతను మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’ అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ…‘రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రతి సీన్ అందరికీ నచ్చేంత వరకు కావాల్సినంత సమయం తీసుకుని రూపొందించాం. గతంలో రీషూట్ చేస్తే అదో తప్పుగా భావించేవాళ్లు. ఇప్పుడు సినిమా బాగా వచ్చేందుకు రీషూట్స్ చేసుకుంటున్నాం. మా అమ్మ ఈ సినిమాకు నిర్మాత. ఖర్చు గురించి ఆలోచించకుండా క్వాలిటీగా సినిమా నిర్మించింది. ఆడవారితో సత్సంబంధాలు ఉండాలని కోరుకునే యువకుడిగా కనిపిస్తాను. హీరో క్యారెక్టరైజేషన్‌లోనే వినోదం ఉంటుంది. షెర్లీ నాయికగా మంచి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ‘సినిమాలో రొమాన్స్‌తో పాటు మంచి కామెడీ ఉంటుంది. టీజర్లో కృష్ణ, వ్రింద ప్రేమ మిమ్మల్ని ఆకట్టుకుందని ఆశిస్తున్నాం’ అని దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

