మూసకు భిన్నంగా నిరంతరం కొత్తదనం కోసం అన్వేషిస్తుంటారు అగ్రహీరో నాగార్జున. కెరీర్ ఆరంభం నుంచి అదే పంథాలో కొనసాగుతున్నారాయన. పరిశ్రమలో నిత్య ప్రయోగాల సహవాసిగా ఆయనకు పేరుంది. మూడు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ నుంచి కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. వీటిలో నాగార్జున ైస్టెలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్ పాత్రను పోషిస్తున్నారు.
దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 5న సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సోనాల్‌చౌహాన్, గుల్‌పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్.జీ, సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాతలు: నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.