నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నారాయణదాస్ కె నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా పండక్కి అక్టోబర్ 5న తెరపైకి రాబోతున్నది.
సినిమా ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ…‘భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. నాగార్జున యాక్షన్ ఇంటెన్స్‌గా ఉంటుంది.
ఇప్పటికే విడుదల చేసిన ది కిల్లింగ్ మెషీన్, తమహగనే ప్రోమోలకు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉంటుంది’ అన్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ : బ్రహ్మ కడలి, యాక్షన్ : దినేష్ సుబ్బరాయన్, కేచ, సినిమాటోగ్రఫీ : ముఖేష్. జి, సంగీతం : మార్క్ కె రాబిన్, భరత్ సౌరబ్.