మిస్టర్ పర్ఫెక్ట్గా నాగచైతన్య..వైరల్ అవుతున్న న్యూలుక్..
Nagachaitanya | అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తన నటనతో అభినయంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న నటుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. గతేడాది లవ్‌స్టోరితో వచ్చి సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య ఈ ఏడాది బంగార్రాజుతో కలెక్షన్ల జోరును చూపిస్తున్నాడు. వరుసగా రెండు హిట్లను సొంతం చేసుకున్న నాగచైతన్య థాంక్యూ మూవీతో హ్యట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం థాంక్యూ మూవీ షూటింగ్ రష్యాలోని మాస్కోలో జరుగుతుంది. మాస్కోలోని మంచు కట్టిన వీధుల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గడ్డ కట్టే చలిలో షూటింగ్‌ను జరుపుకుంటున్నట్టు గతవారం రాశీఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. అయితే తాజాగా నాగ చైతన్య కూడా ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా వేదికగా పంచుకున్నాడు. ఇందులో నాగచైతన్య సరికొత్త మేకోవర్‌తో కళ్లజోడు ధరించి మిస్టర్ పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ క్లిక్ మనిపించాడట.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న థ్యాంక్యూ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నాగచైతన్య మహేశ్ బాబుకు వీరాభిమానిగా నటించనున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

