Nagachaitanya-Raashi Khanna | ‘థాంక్యూ’ సెట్లో రాశిఖన్నా, నాగచైతన్య.. వైరల్ అవుతున్న ఫోటో
Nagachaitanya-Raashi Khanna Photo | అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తన నటన, అభినయంతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు నాగచైతన్య. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. గతేడాది ‘లవ్‌స్టోరి’తో వచ్చి సూపర్ హిట్ సాధించిన నాగచైతన్య ఈ ఏడాది ‘బంగార్రాజు’తో సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. రెండు వరుస విజయాలతో నాగచైతన్య టైర్2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్గా నటించింది.
తాజాగా ఈ చిత్రం నుంచి నాగచైతన్య, రాశిఖన్నా కలిసి ఉన్న ఫోటోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫోటోలో నాగచైతన్య ఫోన్ చూస్తుండగా.. రాశిఖన్నా ఎవరితోనో సంభాషిస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నాగచైతన్య హకీ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. అవికాగోర్, మాళవికా నాయర్లు కీలకపాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలోనే ‘ధూత’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది.
Yuva Samrat @chay_akkineni & @RaashiiKhanna_ from the sets of #ThankYouTheMovie #Nagachaitanya #RaashiKhanna pic.twitter.com/aHZ8Z2A7y0
— BA Raju's Team (@baraju_SuperHit) April 25, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

