నాగబాబు ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘మేము ‘కాప్’లం’. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల కీలక పాత్రధారులు. రా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి.వి.ఎస్.రవి నిర్మించారు. ఈ నెల 22 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. మహాదేవపట్నం అనే పల్లెటూరి నేపథ్యంలో సలార్రాజు అనే కోడిపుంజు ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో కామెడీ, మిస్టరీ ప్రధానంగా ట్రైలర్ ఆకట్టుకుంది. గ్రామీణ జీవితం, అక్కడి స్థానిక రాజకీయాలు, కోడిపుంజు మిస్సింగ్ మిస్టరీ వంటి అంశాలతో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సిరీస్‌కు సంగీతం: సాకేత్ కోమందూరి, కథ: శోభన్ చిట్టిప్రోలు, దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి.