Naga Vamsi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఫౌజీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చారిత్రక నేపథ్యంతో యుద్ధం, ప్రేమ అనే రెండు ప్రధాన భావోద్వేగాలను మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం హను రాఘవపూడి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. నిర్మాణ విలువలు, విజువల్ గ్రాండియర్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా మేకర్స్ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ‘ఫౌజీ’పై మరింత ఆసక్తిని పెంచాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ తనకు సినిమా రషెస్ చూపించారని వెల్లడించారు. ఆ రషెస్ చూసిన తర్వాత తాను పూర్తిగా ఆశ్చర్యపోయానని, సినిమా విజువల్స్ తనను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని మనం ఊహించని స్థాయిలో, హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌లా రూపొందిస్తున్నారు అంటూ చిత్రబృందాన్ని ప్రశంసించారు. నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రభాస్ అభిమానులు సినిమాపై మరింత ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదల చేయాలని మేకర్స్‌ను సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
ఈ చిత్రం ద్వారా సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్గా సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. అలాగే బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద, రాహుల్ రవీంద్రన్, చైత్ర జె. ఆచార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, భావోద్వేగాలతో కూడిన మెలోడీలతో పాటు గ్రాండియర్‌కు తగ్గ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘ది రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘కల్కి’ సీక్వెల్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ‘ఫౌజీ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నాగవంశీ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ హైప్‌ను మరింత పెంచేశాయి.అయితే చిత్రబృందం నుంచి ఇప్పటివరకు టీజర్ లేదా ఫస్ట్ లుక్‌పై అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.