మాస్ సినిమాలు కూడా చేస్తా!
నాగశౌర్య..పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్స్తో పాటు కుటుంబ కథల్లో చక్కగా ఒదిగిపోతాడనే పేరు తెచ్చుకున్నాడు.
నాగశౌర్య..పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్స్తో పాటు కుటుంబ కథల్లో చక్కగా ఒదిగిపోతాడనే పేరు తెచ్చుకున్నాడు. అయితే తనకు మాత్రం విభిన్నమైన జోనర్స్లో సినిమాలు చేయాలనుందని, నటుడిగా ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించాలంటే కథల్లో వైవిధ్యం ఉండాల్సిందే అంటున్నారు. ఆయన కథానాయకుడిగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఉషా మూల్పూరి నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన సంగతులు..
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
రెండేళ్ల క్రితమే ఈ కథ విన్నా. బాగా నచ్చింది. చక్కటి ఫ్యామిలీ నేపథ్యంతో పాటు వినోదం, మాస్ అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. కథ విన్న వెంటనే ఓకే చెప్పాను. ఇదొక ఎవర్గ్రీన్ స్టోరీ. కుటుంబాలు ఉన్నంత వరకు ఇలాంటి కథలకు ఆదరణ దక్కుతూనే ఉంటుంది.
ఈ సినిమాలో మీరు బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటించారు. ఈ తరహా క్యారెక్టర్స్‌తో ఇటీవల తెలుగులో చాలా సినిమాలొచ్చాయి కదా?
ఎన్టీఆర్‌గారి ‘అదుర్స్’ మొదలుకొని ఇటీవల వచ్చిన నాని ‘అంటే సుందరానికి’ వరకు చాలా సినిమాల్లో హీరోలు బ్రాహ్మణ యువకుల పాత్రల్లో కనిపించారు. అయితే కేవలం పాత్రకు సంబంధించిన నేపథ్యం తప్ప ప్రతీ కథ దేనికదే భిన్నంగా ఉంటుంది. ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంలో నేను బ్రాహ్మణ యువకుడిగా కనిపించినా…ఆ సినిమా కథలతో ఎలాంటి పోలిక ఉండదు.
మీరు ఎక్కువగా రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేస్తుంటారు. ఈ జోనర్లో సౌకర్యంగా ఫీలవుతారా?
వాస్తవం చెప్పాలంటే రొమాంటిక్ సినిమాలు నాకు అంత కంఫర్టబుల్‌గా అనిపించవు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తుంటే కాస్త ఇబ్బందిగా ఫీలవుతాను (నవ్వుతూ).
సినిమాలో కృష్ణ పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
కమల్‌హాసన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోలు బ్రాహ్మణ పాత్రల్లో అద్భుతమైన అభినయంతో మెప్పించారు. నేను కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నా. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నాకు మంచి మిత్రులు. తాను బ్రాహ్మణ్ కావడం వల్ల ఆయన్ని అడిగి చాలా విషయాలు తెలుసుకున్నా.
మాస్ కథలతో సినిమాలు చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా?
అన్ని జోనర్స్లో ప్రయత్నిస్తేనే ఏ నటుడికైనా పరిపూర్ణత లభిస్తుంది. ఏదో ఒక మూసకు పరిమితమైపోకుండా విభిన్నమైన కథల్ని ఎంచుకొని సినిమాలు చేయాలనుకుంటున్నా. క్లాస్ సినిమాల ద్వారా ఎక్కువ విజయాలు దక్కుతున్నాయని ఎప్పటికే అదే పంథాలో కొనసాగడం కరెక్ట్ కాదు. వైవిధ్యమైన కథల ద్వారానే సంతృప్తి దొరుకుతుంది. నేను కూడా మాస్ సినిమాలు చేయాలనుకుంటున్నా. నా తదుపరి చిత్రం ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ షూటింగ్ పూర్తయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

