Rangabali | న్యూ లుక్‌తో నాగశౌర్య రంగబలి టీజర్ టైం ఫిక్స్
Rangabali | నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న సినిమాల్లో ఒకటి రంగబలి (Rangabali). ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ మన ఊరిలో ఎవడ్రా ఆపేది సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
Rangabali | టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తున్న సినిమాల్లో ఒకటి రంగబలి (Rangabali). విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీకి పవన్ బసంశెట్టి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసే లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ మన ఊరిలో ఎవడ్రా ఆపేది సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
తాజాగా నాగశౌర్య టీం రంగబలి టీజర్ అప్డేట్ అందించింది. జూన్ 8న సాయంత్రం 4:05 గంటలకు టీజర్ లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. తాజా లుక్‌లో సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నాడు నాగశౌర్య. రంగబలి చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రంగబలి షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం జులై 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.
సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్, రమేశ్ రెడ్డి, హరీష్ చంద్ర, బ్రహ్మాస్త్రి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగశౌర్య దీంతోపాటు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
మన ఊరిలో లిరికల్ వీడియో సాంగ్..
#Rangabali Teaser tomorrow at 4:05 PM 💥💥
Stay tuned for the Entertainment Blast ❤️🔥#YuktiThareja @PawanBasamsetti @pawanch19 @DivakarManiDOP #KarthikaSrinivas #ASPrakash @SLVCinemasOffl @saregamasouth pic.twitter.com/oENecxE9No
— Naga Shaurya (@IamNagashaurya) June 7, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

