Vrushakarma | రాజస్థాన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘వృషకర్మ’.. త్వరలోనే రిలీజ్ అనౌన్స్మెంట్!
Vrushakarma | యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా మైథికల్ థ్రిల్లర్ చిత్రం 'వృషకర్మ' (Vrushakarma). 'విరూపాక్ష' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Vrushakarma | యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా మైథికల్ థ్రిల్లర్ చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma). ‘విరూపాక్ష’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ని రాజస్థాన్‌లో పూర్తిచేసుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన ‘సుకుమార్ రైటింగ్స్’ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
మరోవైపు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా, ఒక అద్భుతమైన మైథికల్ థ్రిల్లర్ అనుభూతిని అందించేందుకు భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ (VFX) పనులు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరియు శ్రీ నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

