Naga Chaitanya | సూపర్ నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలో ‘ధూత’ వెబ్‌సిరీస్.. వైరల్ అవుతున్న నాగచైతన్య పోస్ట్
Naga Chaitanya Dhootha web series | అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సినీరంగంలో దూసుకుపొతున్నాడు. ‘లవ్‌స్టోరి’, ‘బంగార్రాజు’ వంటి రెండు వరుస విజయాలతో టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘థాంక్యూ’ విడుదలకు సిద్ధంగా ఉంది. మనం ఫేం విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ‘ధూత’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ వెబ్ సిరీస్‌ను అమెజాన్ సంస్థ నిర్మిస్తుంది. లేటెస్ట్గా అమెజాన్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను అధికారికంగా ప్రకటించింది. తాజాగా నాగచైతన్య దర్శకుడు విక్రమ్ కుమార్, పార్వతి, ప్రియా లతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. సూపర నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కనుంది. నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి అమేజాన్ ఒరిజినల్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మలయాళ భామ పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు చివరి వారంలో ఈ వెబ్‌సిరీస్ విడుదలకానున్నట్లు తెలుస్తుంది.
#Dhootha pic.twitter.com/5NRHSteasd
— chaitanya akkineni (@chay_akkineni) April 30, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

