Custody Movie | న్యాయం పక్కన నిల్చున్న నాగచైతన్య.. ఉత్కంఠ భరితంగా కస్టడీ మూవీ ట్రైలర్
Custody Movie Trailer | యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నాడు.
Custody Movie Trailer | యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు అనుకునే లోపు థాంక్యూ ద్వారా మరో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని కస్టడీ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. సీఎం సెక్యూరిటీకని పంపిస్తే.. నాగ చైతన్య ఆమె బండినే ఆపేయడం డ్యూటీలో తన నిజాయితిని చూపిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య శివ అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈ సారి అక్కినేని అభిమానులకు గ్రహాల మూమెంట్ ఎక్కడో స్టార్ట్ అయినట్లు కనిపిస్తుంది. యాక్షన్, థ్రిల్, లవ్ ఇలా షడ్ రుచుల సమ్మేళనంగా ట్రైలర్ కనిపిస్తుంది. నాగచైతన్య లుక్ కూడా కొత్తగా, చాలా నేచురల్‌గా కనిపించింది. ఇక చాలా కాలం తర్వాత కృతికి మంచి పాత్ర పడ్డట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
ఇక విలన్‌ను అంతమొందించే హీరోల సినిమాలు మనం ఎన్నో చూసుంటాం. కానీ ఈ సినిమాలో విలన్‌ను నాగచైతన్య కాపాడబోతున్నట్లు తెలుస్తుంది.’ న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’, ‘నిజం గెలవడానికి లేట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది’ అంటూ చైతన్య పలికే సంభాషణలు ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఇక ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ట్రైలర్లోనే ఈ రేంజ్లో ఉంటే సినిమాలో ఏ రేంజ్లో ఉంటుంది అని అనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు ఉన్న అంచనాలను కస్టడీ ట్రైలర్ రెట్టింపు చేసింది. ప్రియమణి కీలకపాత్రలో నటించిన ఈ సినిమా మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

