షూటింగ్ పూర్తి.. చైతూకి కేక్ తినిపించిన అమీర్

అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య తన కెరీర్‌ని స్లో అండ్ స్టడీగా ముందుకు తీసుకెళుతున్నాడు. మొన్నటి వరకు టాలీవుడ్లో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన నాగ చైతన్య ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. చైతూ తెలుగులో జోష్ సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. రీసెంట్గా లవ్ స్టోరీ చిత్ర షూటింగ్ పూర్తి చేశారు.ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది.
రీసెంట్గా అక్కినేని నాగ చైతన్య హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ రీమేక్ చిత్రం లాల్ సింగ్ చద్దాలో నటించాడు. ఇందులో చైతూ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఆమీర్ ఖాన్ తో వెండి తెరని పంచుకున్నాడు. “లాల్ సింగ్ చద్దా” సినిమాలో ఆర్మీ లుక్ కోసం కొంత కాలం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆమీర్ ఖాన్, రాధిక చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా చైతూ పార్ట్ పూర్తి కాగా, అమీర్ ఖాన్ ఇతర చిత్ర బృందం చైతూతో కేక్ కట్ చేయించి గ్రాండ్‌గా సెండాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక చైతూ త్వరలో మనం, 24, నాని గ్యాంగ్ లీడర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ “థ్యాంక్ యూ” సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.
YuvaSamrat @chay_akkineni #NagaChaitanya wrapped up his shoot for #AamirKhan's #LaalSinghChaddha pic.twitter.com/M2xnq4tzx8
— BA Raju's Team (@baraju_SuperHit) August 10, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

