హీరోల మధ్య బాక్సాపీస్ వద్ద పోటీ ఏర్పడటం సహజంగా జరిగేదే. కానీ హీరోహీరోయిన్ల సినిమాల మధ్య పోరు అప్పుడపుడు కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ టాపిక్ రావడానికి కారణం నాగచైతన్య (Naga Chaitanya), హన్సికా మోత్వానీ. ఈ ఇద్దరు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద పోటీకి సై అంటున్నారు.
దేశముదురు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది గ్లామర్ డాళ్ హన్సికా మోత్వానీ (Hansika Motwani). తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ నటిస్తోన్న చిత్రం మహా (Maha). జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూఆర్ జమీల్ (UR Jameel) డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రంలో స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుంది. హన్సికకు ఇది 50వ చిత్రం కావడం విశేషం.
మరోవైపు విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న చిత్రం థ్యాంక్యూ (Thank You). ఈ సినిమా కూడా అదే రోజున వస్తోంది. అంటే చైతూ, హన్సికా మధ్య పోటీ ఉన్నట్టే. డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కి ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ రెండు చిత్రాలకు స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : Remunerations | Mega 154 క్రేజీ టాక్..బడ్జెట్లో అగ్రభాగం రెమ్యునరేషన్లకే..?
Read Also : Kesariya Song | బ్యూటిఫుల్ ‘కేసరియా’ మెలోడీ లవ్ ట్రాక్ వచ్చేసింది..