గత ఏడాది ‘తండేల్’తో కెరీర్లోనే భారీ హిట్‌ను అందుకున్నారు హీరో నాగచైతన్య. ప్రస్తుతం ఆయన మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’లో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. తమిళంలో సండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా) వంటి చిత్రాలతో పేరు పొందిన లింగుస్వామి గత కొంతకాలంగా సరైన సక్సెస్‌లేక సతమతమవుతున్నారు.
రామ్ పోతినేనితో తెలుగులో ఆయన తీసిన ‘ది వారియర్’ కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తెలుగులో నాగచైతన్యతో సినిమాకు సిద్ధమవుతున్నారని తెలిసింది. యాక్షన్, ఫ్యామిలీ అంశాలు కలబోసినన కథ ఇదని, నాగచైతన్యను సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృం దం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.