Custody Movie | ఐదు విడుదల కాబోతున్న ‘కస్టడీ’ సినిమాపై అక్కినేని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ దాహం తీరుస్తుందని ధీమాగా ఉన్నారు. దానికి తగ్గట్లే టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య తీరిక లేకుండా వరుసగా ఇంటర్వూలు ఇస్తున్నాడు. ఇంటర్వూలలో సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు కూడా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ సందర్భంగా నాగచైతన్య, శివ నిర్వాణతో మరో సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు. శివ నిర్వాణ మంచి వ్యక్తి అని, తనకు ఎలాంటి స్టోరీలు సరిపోతాయో శివకు బాగా తెలుసని ప్రశంసలు కురిపించాడు. వాళ్ల కాంబోలో వచ్చిన మజిలీ సినిమా తనకు ఎంతో నచ్చిందని, తన ఇష్టాయిష్టాలు శివ నిర్వాణకు తెలుసని చెప్పుకొచ్చాడు. ఇక దాంతో అభిమానులు మజిలీ-2 తీయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీళ్ల కాంబోలో వచ్చిన మజిలీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాగచైతన్య కెరీర్లో మైలు రాయిగా ఈ సినిమా నిలిచింది.