ప్రేమతో ‘థాంక్యూ’ చెప్పండి
‘థాంక్యూ’ అనే పదంలోనే మహత్తుదాగి ఉందని, అవసరమైన చాలా సందర్భాల్లో తాను ఈ పదాన్ని ఉపయోగిస్తానని చెప్పారు యువ హీరో నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన ‘థాంక్యూ’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
‘థాంక్యూ’ అనే పదంలోనే మహత్తుదాగి ఉందని, అవసరమైన చాలా సందర్భాల్లో తాను ఈ పదాన్ని ఉపయోగిస్తానని చెప్పారు యువ హీరో నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన ‘థాంక్యూ’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా తన ఉన్నతిలో కీలక భూమిక పోషించిన వ్యక్తులకు కృతజ్ఞతలు చెబుతూ నాగచైతన్య ట్విట్టర్లో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు.
“థాంక్యూ’ సినీ ప్రయాణంలో చాలా నేర్చుకున్నా. నా జీవిత గమనంలో అండగా నిలిచిన ప్రియమైన వారికి ఈ పోస్ట్‌ను ఆంకితమిస్తున్నా. అమ్మ..నా బలం. జీవితంలోని ప్రతి దశలో నన్ను గొప్ప పరిణితి సాధించేలా తీర్చిదిద్దింది. నాన్న ఓ మార్గదర్శిలా, గొప్ప స్నేహితుడిలా దిశానిర్దేశం చేశారు. ఆయనకంటే ఉన్నతమైన స్నేహితుడు ఎవరూ లేరనుకుంటా. ఇక హాష్ (పెంపుడు శునకం) ఎలా ప్రేమించాలో, మానవీయ స్పృహ కలిగి ఉండాలనే విషయాల్ని నేర్పించింది. వీరందరికి థాంక్యూ. మీరు కూడా ప్రియమైన వారికి ప్రేమతో థాంక్యూ చెప్పండి’ అని నాగచైతన్య ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘థాంక్యూ’ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

