నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. జూలై 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య ైస్టెలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు.
‘నాగచైతన్య కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది. ఓ యువకుడి జీవితంలోని భిన్న దశల్లో కలిగే ప్రేమకు అద్దం పడుతూ హృద్యంగా సాగుతుంది. నాగచైతన్య మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. బీవీఎస్ రవి కథనందించిన ఈ చిత్రానికి తమన్ స్వరాల్ని సమకూర్చారు.