Naga Chaitanya | తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో, బయట వచ్చే వార్తలను ఏమాత్రం పట్టించుకోనని, వృత్తిపరంగా పర్ఫెక్షన్ కనబరచడంపైనే తాను ఎక్కువ శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు యువ హీరో నాగచైతన్య. ఆయన నటించిన ‘దూత’ వెబ్‌సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నాగచైతన్య. ముఖ్యంగా సమంతతో విడాకుల అనంతరం తన వ్యక్తిగత జీవితం సోషల్‌మీడియాలో చర్చనీయాంశం కావడం గురించి మాట్లాడారు.
‘ఇలాంటి విషయాల గురించి నేను పెద్దగా ఆలోచించను. ప్రేక్షకులకు నా వృత్తి గురించే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారిని ఎంటర్టైన్ చేసే మంచి కథల్ని ఎంచుకొని సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం. అంతిమంగా ప్రేక్షకులు వ్యక్తిగత విషయాల కంటే సినిమాపరమైన విజయాలనే ఎక్కువగా గుర్తుంచుకుంటారు’ అని నాగచైతన్య అన్నారు. ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం ‘తండేల్’లో నటిస్తున్నారు.