Naga Chaitanya | అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. గతేడాది ‘లవ్‌స్టోరి’తో సూపర్ హిట్‌ను సాధించిన చైతన్య.. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో బ్లాక్ బస్టర్ సాధించాడు. రెండు వరుస విజయాలతో టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘థాంక్యూ’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో గతంలో విడుదలైన నాగ చైతన్య లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్గా థాంక్యూ చిత్రంలోని న్యూ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ లుక్‌లో నాగచైతన్య నోట్లో సిగరెట్ కాల్చుతూ ఇంటెన్సీవ్ లుక్‌లో ఉన్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.ఈ చిత్రంలో నాగచైతన్య, మహేశ్ బాబుకు వీరాభిమానిగా నటించనున్నాడు.
Yuvasamrat @chay_akkineni's rugged look from his upcoming movie #ThankYou !
#Nagachaitanya #ThankYouTheMovie #iDreamMedia
Subscribe To https://t.co/dOHgmdmPvx pic.twitter.com/r2NAqi98XV
— iDream Media (@iDreamMedia) May 23, 2022