Naga Chaitanya: చైతూ తొలి హిందీ చిత్రం వాయిదా పడనుందా..!

కెరీర్లో స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతున్న నాగ చైతన్య రీసెంట్గా లవ్ స్టోరీ చిత్రంతో పెద్ద హిట్ కొట్టాడు. తన కెరీర్లోనే మంచి హిట్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇక చైతన్య తొలి సారి లాల్ సింగ్ చద్దా అనే హిందీ చిత్రంలో నటించగా, ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాని ఏమైందో ఏమో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
క్రిస్మస్కు పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. క్రిస్మస్ కు 83.. జెర్సీ.. సర్కస్ ఇంకా కొన్ని చిత్రాలు విడుదల కు సిద్దం అవుతున్నాయి. అందుకే లాల్ సింగ్ చద్దా సినిమాను పోటీ లేని ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించారట. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని అమీర్ ఖాన్ భావిస్తున్నాడట. ఇదిలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ, బంగార్రాజుతో పాటు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రూపొందనున్న వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

