ఆసక్తి రేకెత్తిస్తున్న NC22 ఫస్ట్‌లుక్ పోస్టర్..!
NC22 Movie | అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు.
NC22 Movie | అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన మానాడు ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు అక్కినేని అభిమానులను ఖుషీ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఈ సినిమాకు కస్టడీ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాగచైతన్య చుట్టూ పోలీసులందరూ చేరి గన్ను గురి పెట్టారు. పోస్టర్‌తోనే చిత్రబృందం ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి క్రియేట్ చేశారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. తమిళ హీరో జీవా, అరవింద్ స్వామి కీలకపాత్రల్లో నటించనున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘ధూత’ వెబ్‌సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్తో కలిసి అమేజాన్ ఒరిజినల్స్ నిర్మిస్తుంది. ఈ వెబ్‌సీరీస్‌లో మలయాళ భామ పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు.
Our Beloved @chay_akkineni's B'Day Celebrations on!!🔥
Here we GO, the RAGING First Look & Title of #NC22 💫#𝐂𝐮𝐬𝐭𝐨𝐝𝐲 – A @vp_offl HUNT❤️🔥#CustodyFL @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @SS_Screens @srinivasaaoffl @realsarathkumar #Priyamani #VP11 pic.twitter.com/6n2s9RUgIW
— Srinivasaa Chitturi (@srinivasaaoffl) November 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

