Naga Chaitanya | నాగచైతన్యకు సమంతలో నచ్చిన క్వాలిటీ అదేనట..!
Naga Chaitanya About Samantha | ఇప్పటికీ సినీ ప్రేక్షకులు నాగచైతన్య, సమంత కలిస్తే బాగుండు అని అనుకుంటుంటారు. అంతలా వాళ్లను ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. తొలిసినిమా 'ఏ మాయ చేశావే'తోనే వీళ్లిద్దరూ బెస్ట్ పేయిర్ అనిపించుకున్నారు.
Naga Chaitanya About Samantha | ఇప్పటికీ చాలా మంది నాగచైతన్య, సమంత కలిస్తే బాగుండు అని అనుకుంటుంటారు. అంతలా వాళ్లను ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. తొలిసినిమా ‘ఏ మాయ చేశావే’తోనే వీళ్లిద్దరూ బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఆన్ స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ బెస్ట్ పెయిర్ అనిపించుకోవాలని ఆరేళ్ల కిందట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి అప్పట్లో దక్షిణాదిలో హాట్ టాపిక్ అయింది. అయితే వీళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగానే సాగిందని చెప్పాలి. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇటీవలే నాగచైతన్య తొలిసారి తన విడాకులపై స్పందించి సమంత చాలా మంచి అమ్మాయని, మీడియా తమ మధ్య దూరాన్ని పెంచిందని, విడాకుల వరకు తీసుకొచ్చిందని తెలిపాడు.
ఇక దీనిపై సామ్ కూడా పరోక్షంగా స్పందించి మనమంతా ఒక్కటే కానీ అహాలు, భయాలు, నమ్మకాలు మనల్ని విడదీస్తుంటాయి అని ఓ కోట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దాంతో వీళ్లిద్దరూ ఇగోలకి పోయి విడాకులు తీసుకున్నారు అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా చైతన్య.. సామ్ హార్డ్‌వర్కర్ అంటూ వర్ణించాడు. కస్టడీలో భాగంగా ఓ ఇంటర్వూలో ‘మీ కో యాక్టర్స్‌లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటని’ యాంకర్ ప్రశ్నించగా.. పూజా హెగ్డేలో స్టైల్ అని, కృతి శెట్టిలో ఇన్నోసెన్స్ అని, అలాగే సామ్లో హార్డ్‌వర్క్ నచ్చిన క్వాలిటీ అని చెప్పుకొచ్చాడు. దాంతో పలువురు అభిమానులు ‘మళ్లీ మీరు కలిసిపోండి..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

