Naga Babu | హేయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుకు మెగా బ్రదర్ ఆర్థిక సహయం.. మంచు ఫ్యామిలీ వివాదంలోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చాడా?
మంచు మోహన్‌బాబు తనను, తన కుల వృత్తిని అసభ్యపదజాలంతో దూషించాడని, తిరిగి తననే తప్పుడు కేసులో ఇరికించాడంటూ ఆరోపించిన హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుకు మెగా బ్రదర్ నాగబాబు సహాయం చేశాడు.
Naga Babu | మంచు మోహన్‌బాబు తనను, తన కుల వృత్తిని అసభ్యపదజాలంతో దూషించాడని, తిరిగి తననే తప్పుడు కేసులో ఇరికించాడంటూ ఆరోపించిన హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుకు మెగా బ్రదర్ నాగబాబు సహాయం చేశాడు. కొన్ని రోజుల ముందు ఐదు లక్షల విలువ చేసే మేకప్, హేయిర్ డ్రెస్సింగ్ సామాను దొంగిలించాడంటూ నాగశ్రీను పై మంచు విష్ణు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసుపై నాగశ్రీను స్పందించి మొహన్ బాబు దగ్గర గత పది సంత్సరాలనుండి పనిచేస్తున్నానని, అయన నన్ను, నా తల్లిని, నా కులాన్ని అసభ్యంగా తిట్టాడంటూ ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
నాగశ్రీను తన తల్లి బ్రెయిన్ స్ట్రోక్‌తో హాస్పిటల్లో ఉందని, తనకు జీతం కూడా రాలేదని డబ్బులకు ఇబ్బందిగా ఉందని కూడా వెల్లడించాడు. దానికి స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు ఆర్థిక సహాయంగా 50వేల రూపాయల చెక్‌ను నాగశ్రీనుకు ఇచ్చాడు. అంతేకాకుండా వారికి అపోలో ఆస్పత్రిలో మెడికల్ చెకప్ చేయించాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా నాగబాబు సహాయం చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

