బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం నుండి 13వ కంటెస్టెంట్‌గా బయటకు వచ్చిన ప్రియాంక ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటుంది. దాదాపు 91 రోజులు హౌజ్‌లో ఉండి నువ్వంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేశావు అంటూ పలువురు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ప్రియాంక .. తమన్నా సింహాద్రి లాగే త్వరగానే బయటకు వస్తుందని అందరు ఊహించారు. కాని అందరి ఊహాలోచనలు తలకిందులు చేసి తానేంటో నిరూపించింది.
బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక.. మెగా బ్రదర్ నాగబాబుని కలిసింది. ఆయన ఆశీర్వాదం అందుకుంది. అయితే పింకీతో దిగిన ఫొటోని షేర్ చేసిన నాగబాబు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఎన్నో అసమానతలు, అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నావు. నువ్వు బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోవచ్చు.
కానీ నిత్యం సమాజంలో నిత్యం నీలా అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి స్పూర్తిగా నిలిచావు. ఎలా ఉన్నా కూడా జీవితంలో గెలవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి అని నాగబాబు రాసుకొచ్చారు. కాగా, జబర్దస్త్ వేదికగా ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక సింగ్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా చాలా ఫేమస్ పొందింది.