శనివారం వచ్చిందంటే నాగార్జునతో ఇంటి సభ్యులు చేసే సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ ఎపిసోడ్లో జెస్సీ జైలు నుండి బయటకు వచ్చాడు. షణ్ముఖ్ సిరి మరోసారి గేమ్ ప్లాన్ గురించి ముచ్చటించుకున్నారు.మెంటల్లీ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అని షణ్ముఖ్ అంటే.. టైం వచ్చినప్పుడు అన్నీ నువ్వే తెలుసుకుంటావు అని సిరి పేర్కొంది.
ఇక నాగార్జున అందరికి హాయ్ చెబుతూ.. జెస్సీని అందరు తొక్కేస్తున్నారని పేర్కొన్నాడు. లోబో… ప్రియపై గొంతెత్తి అంతలా అరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పదేపదే బస్తీ నుంచి వచ్చానంటూ సింపతీ కార్డ్ యూజ్ చేయొద్దని హితవు పలికాడు. రెండు రోజులు కడుపు మాడ్చుకున్న ఇంటి సభ్యుల కోసం బిగ్ బాస్ స్పెషల్ ఫుడ్ ఐటమ్ పంపించారు. వాటిని చకచకా ఆరగించారు.
ఇక షణ్ముఖ్- సిరి జోడీకి మాత్రం ఘాటైన పచ్చిమిర్చిని పంపించాడు. ఫణ్ముఖ్కి కబుర్లు చెప్పడం వరకే టైం సరిపోతుంది. ఫైర్ బయటకు రావాలని మిర్చి పంపించారని పేర్కొన్నాడు నాగ్. నీ ఆట నువ్వు ఆడని సిరికి సూచిస్తూనే మీ వల్ల జెస్సీ సఫర్ అవుతున్నాడని తెలిపాడు. ఇక నాగ్ పాటని ప్లే చేయగా, అది వింటుంటే హమీదా లవ్ ఫీల్ గుర్తొచ్చిందని చెప్పాడు శ్రీరామ్.