Project K Glimpse | ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెర.. ప్రాజెక్ట్ కే అంటే ఏంటో తెలిసిపోయిందిగా..!
Project K Glimpse | ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను పెట్టినట్లు మేకర్స్ బయటపెట్టారు.
Project K Glimpse | ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను పెట్టినట్లు మేకర్స్ బయటపెట్టారు. ఎన్నో రోజుల వెయిటింగ్‌కు ఫుల్స్టాప్ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్‌కాన్ వేడుకల్లో ప్రాజెక్ట్ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు. కలియుగం చివరలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడని.. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి కల్కిలా ఉద్భవిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని ఒక సైన్స్ ఫిక్షన్‌గా ప్రభాస్ సినిమా తెరకెక్కుతున్నట్లు ఫస్ట్ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.
‘కలియుగపు చీకటి రోజుల్లో ఓ దుష్టశక్తి ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. దేవుళ్లను కూడా అంతం చేస్తానని ప్రతినబూనుతుంది. ప్రజలందరూ తన బానిసలుగా ఉండాలని ఆజ్ఞాపిస్తుంది. ఆ దుష్టశక్తిని, దాని అనుచరగణాన్ని అంతమొందించడానికి ఓ వీరుడు ఉద్భవిస్తాడు’ అని చెప్పేలా ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ సాగింది. మొత్తం 75 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్‌లో కేవలం ఒకే ఒక్క డైలాగ్ ఉంది. వాటీజ్ ప్రాజెక్ట్ కే అంటూ ఒకే ఒక్క డైలాగ్‌తో ఉన్న ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇందులోని యాక్షన్స్ సీన్స్, విజువల్స్ అందర్నీ కట్టిపడేసేలా ఉన్నాయి. సంతోశ్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తంగా హాలీవుడ్ రేంజ్లో ఉన్న గ్లింప్స్ చూస్తుంటే గూస్బంప్స్ వచ్చేస్తున్నాయి. బాహుబలి సినిమాతో తొలి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ కావడం పక్కా అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

