Nadav Lapid | ‘ది కశ్మీర్ ఫైల్స్’పై లాపిడ్ వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన జ్యూరీ హెడ్..!
Nadav Lapid | గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించడంపై జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఒక దరిద్రగొట్టు సినిమా అని, వల్గర్‌గా తీశారు అంటూ లాపిడ్ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై లాపిడ్ తాజాగా స్పందించారు.
Nadav Lapid | గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించడంపై జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఒక దరిద్రగొట్టు సినిమా అని, వల్గర్‌గా తీశారు అంటూ లాపిడ్ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో లాపిడ్ తాజాగా స్పందించారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడిన లాపిడ్ ఇఫీ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. ఎవరినీ కించపరిచే, అవమానించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే అందుకు తనను క్షమించాలని కోరారు.
గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రదర్శించడాన్ని జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ ఫిలింమేకర్ అయిన నాదవ్ లాపిడ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ పనోరమా కేటగిరీలో ఈ నెల 22న ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో ప్రదర్శించిన 15 చిత్రాల్లో ఇదొకటి. చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించడంపై నాదవ్ లాపిడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే లాపిడ్ తాను చేసిన వ్యాఖ్యలకు గానూ క్షమాపణలు కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

