అందాల ముద్దుగుమ్మలు హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పొంగే సొగసులతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ అందాల భామలు ఒకవైపు సినిమాలతో సందడి చేస్తూనే మరోవైపు ఫొటో షూట్స్‌తో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో మల్లూ భామల హవా నడుస్తుండగా, వీరు తమ అందచందాల ఆరబోతతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్ వీలున్నప్పుడల్లా అందాలు ఆరబోస్తూనే ఉంటారు. తాజాగా నభా నటేష్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో షూట్ తో మంటలు పుట్టిస్తుంది. నభాని ఇలా చూసి కుర్రకారు గుండెలు జరిపోతున్నాయి. గతంలోను నభా హాట్ హాట్‌గా ఫోటో షూట్స్ చేసిన ఈ ఫొటో స్పెషల్‌గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వర్షిణి జానికిరామ్ స్టైలింగ్ చేయగా, `యు ఆర్ ది స్కై… ఎవ్వెరిథింగ్ ఎల్స్ ఈజ్ జస్ట్ ది వెదర్“ అంటూ వ్యాఖ్యాను నభా ఈ ఫోటోతో షేర్ చేసింది.
ప్రస్తుతం నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నభా నటేష్ రానున్న రోజులలో కొన్ని అగ్ర బ్యానర్లకు సంతకాలు చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పాలి.