రజనీకాంత్ అల్లుడిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ సౌత్‌తో పాటు నార్త్‌లోను సత్తా చాటుతున్నాడు. హాలీవుడ్‌లోను అప్పుడప్పుడు మెరుస్తున్నాడు.తాజాగా అన్నయ్య , ప్రముఖ సీనియర్ దర్శకుడు సెల్వ రాఘవన్‌తో చేయబోయే మూవీ ‘నానే వరువేన్’ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. శనివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇందులో ధనుష్ హీరోగాను, విలన్‌గాను నటించనున్నాడట.
తొలి సారి ఓ సినిమాలో ధనుష్ హీరోగా, విలన్‌గా కనిపించనుండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. హీరోను ఎంత గొప్పగా చూపిస్తాడో విలన్ క్యారెక్టర్‌ను అంత కంటే గొప్పగా చూపించడం సెల్వ రాఘవన్ అలవాటు. రీసెంట్‌గానే మారన్ అనే సినిమాను పూర్తి చేసిన ధనుశ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే ‘నానే వరువేన్’ సినిమాను ప్రయోగాత్మకంగా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల సినిమాతో పాటు మరో సినిమాను చేయడానికి ధనుశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రానున్న రోజులలో ధనుష్ వరుస సినిమాలతో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది.