Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ చిత్రం ‘నా సామిరంగ’. (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పాట చూస్తే.. హీరో హీరోయిన్ల మధ్య సాగే కలర్ ఫుల్ ట్రాక్ సినిమాకు హైలెట్ కానుందని విజువల్స్ చెబుతున్నాయి. ఈ మూవీకి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ పాటకు సంబంధించి చిత్రబృందం మేకింగ్ వీడియో విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియోలో నాగార్జున రగ్గడ్ లుక్‌లో హ్యాండ్సమ్గా కనిపిస్తుండగా.. ఆషికా ట్రెడిషనల్ లుక్‌తో ఆకట్టుకుంటుంది.