Naa Saami Ranga | ఘోస్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్, అల్లరి నరేష్ ఇంట్రోను చిత్రబృందం విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తుండగా తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.
‘నా సామిరంగ’ (Naa Saami Ranga) టీజర్‌ను రేపు మధ్యాహ్నం 12.34 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ.
Celebrate #NaaSaamiRanga Teaser Tomorrow at 12:34 PM💥@allarinaresh @mmkeeravaani @vijaybinni4u @AshikaRanganath @mirnaaofficial @itsRajTarun @RuksharDhillon @SS_Screens @boselyricist pic.twitter.com/vHl5rqIXue
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 16, 2023