దేవుడే తన చేతితో..
అగ్ర హీరో నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రంతో ఈ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. విజయ్ బిన్ని దర్శకుడు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది.
అగ్ర హీరో నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రంతో ఈ సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. విజయ్ బిన్ని దర్శకుడు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇటీవల విడుదల చేసిన టైటిల్ సాంగ్ మాస్ నెంబర్‌గా ఆకట్టుకోగా.. తాజాగా ‘దేవుడే తన చేతితో’ అనే మూడో గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. నాగార్జున, అల్లరి నరేష్‌ల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఆవిష్కరిస్తూ హృదయానికి హత్తుకునేలా ఈ పాట సాగింది.
బాల్యం నుంచి వారి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని చూపిస్తూ అర్థవంతమైన సాహిత్యంతో ఆకట్టుకుంది. స్వీయ స్వరకల్పనలో ఎం.ఎం.కీరవాణి రాసిన ఈ గీతాన్ని శాండిల్య ఆలపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్, అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరథి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, దర్శకత్వం: విజయ్ బిన్ని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

