Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చాలా రోజుల తర్వాత నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్ ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్‌తో పాటు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ‘ఇంకా ఇంకా దూరమే’ అంటూ సాగే ఎమోషనల్‌గా సాంగ్‌ను విడుదల చేశారు. ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే.. ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే.. అంటూ ఎమోషనల్‌గా ఈ పాట సాగింది. ఇక ఈ పాటను మమన్ కుమార్, సత్య యామిని కలిసి ఆలపించగా.. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం ఎం కీరవాణి సాహిత్యంతో పాటు సంగీతం సమకుర్చాడు.