తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న సినిమా ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ పతాకంపై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ వందెల దర్శకుడు. ఈ నెల 14న సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ఆహ్లాదకర ప్రేమ కథ ఇది. యువతకు కావాల్సిన వినోదాత్మక అంశాలు ఉంటాయి. మాకు సరైన సంఖ్యలో థియేటర్స్ దొరక్క సినిమాను వాయిదా వేస్తూ వచ్చాము. ఈసారి మంచి తేదీ కుదిరింది. పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.