N.T.R Remuneration | కొరటాల శివ సినిమాకు భారీగా పారితోషికాన్ని పెంచేసిన తారక్?
N.T.R Remuneration | ‘అరవింద సమేత’ తర్వాత దాదాపు నాలుగేళ్ళకు ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్చరణ్ మరో ప్రధాన హీరోగా నటించాడు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికి ఈ చిత్ర కలెక్షన్లు కొన్ని ఏరియాలలో స్టడీగానే ఉన్నాయి. నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ వెండతెరపై కనిపించడంతో నందమూరీ అభిమాను ఫుల్ ఖుషీ అయ్యారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆ నాలుగేళ్ళ గ్యాప్ను పూర్తిచేసేందుకు వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్లో షూటింగ్ ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
తారక్ ఈ చిత్రం కోసం 70రోజుల కాల్షీట్లు ఇచ్చాడట. అయితే ఈ 70 రోజుల కోసం ఎన్టీఆర్ దాదాపు 55కోట్ల వరకు పారితోషికాన్ని అందుకోనున్నాడని సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాకుండా ట్రిపుల్ఆర్ ప్రమోషన్లలో జరిగిన ప్రెస్ మీట్లలో తారక్ అన్ని భాషల్లో మాట్లాడడంతో ప్రతి రాష్ట్రంలో ఈయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో తారక్ తన రెమ్యునరేషన్ పదికోట్లు పెంచాడట. నిర్మాతలు కూడా ఈయనకున్న క్రేజ్ దృష్ట్యా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట.ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి తారక్ 45కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆలీయాభట్ హీరోయిన్గా నటించాల్సి ఉండగా తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- koratalasiva
- N.t.r
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

