Rajinikanth | మైత్రీ మూవీస్‌లో సూపర్‌స్టార్ ?.. రజనీ కోసం కథ రెడీ చేసిన వివేక్ ఆత్రేయ!
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణసంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. దేశంలోని అగ్ర హీరోలందరితో సినిమాలు చేయాలన్న సంకల్పంతో మైత్రీ మూవీమేకర్స్ ముందుకెళ్తున్నదని సంస్థ అధినేతలు నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఓ సందర్భంలో చెప్పారు.
Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణసంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. దేశంలోని అగ్ర హీరోలందరితో సినిమాలు చేయాలన్న సంకల్పంతో మైత్రీ మూవీమేకర్స్ ముందుకెళ్తున్నదని సంస్థ అధినేతలు నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో సన్నీడియోల్తో ‘జాట్’, కోలీవుడ్ హీరో అజిత్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలను నిర్మించిన మైత్రీ సంస్థ.. ఇప్పడు రజనీకాంత్‌తోనూ ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. తెలుగులో డీసెంట్ సినిమాలు తీసిన ఓ యంగ్ డైరెక్టర్‌కి ఈ సినిమా బాధ్యతలు అప్పగించబోతున్నారనేది ఇన్సైడ్ వర్గాల టాక్. ఆ దర్శకుడెవరో కాదు.. వివేక్ ఆత్రేయ. సూపర్‌స్టార్ కోసం వివేక్ ఓ కథ రెడీ చేసుకున్నారట.
త్వరలో రజనీకి ఆ కథ వినిపించబోతున్నారట. నిజానికి మైత్రీ సంస్థలో సినిమా చేసేందుకు రజనీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అయితే.. దర్శకుడెవరనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. వివేక్ కథ సూపర్‌స్టార్‌కి నచ్చితే.. డైరెక్టర్ ఖరారైనట్టే. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి వంటి డీసెంట్ హిట్లను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ.. ‘సరిపోదా శనివారం’తో కమర్షియల్గానూ విజయాన్ని అందుకున్నారు. సూపర్‌స్టార్ కోసం తాను తయారు చేసుకున్న కథ కూడా రజనీ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటుందని తెలుస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

