Trikaala OTT |ఓటీటీల్లో సంచలనం సృష్టిస్తున్న మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ ‘త్రికాల’
Trikaala | తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘త్రికాల’ సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుని, ఇప్పుడు ఓటీటీ వేదికలపై సైతం సంచలనం సృష్టిస్తోంది. ‘A Script of God’ అనే ఆసక్తికరమైన సబ్‌టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతూ టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతోంది.
Trikaala | తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘త్రికాల’ సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుని, ఇప్పుడు ఓటీటీ వేదికలపై సైతం సంచలనం సృష్టిస్తోంది. ‘A Script of God’ అనే ఆసక్తికరమైన సబ్‌టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతూ టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (IMDb)లోనూ ఈ చిత్రం ఏకంగా 9.1 రేటింగ్ అందుకుని చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మణి తెల్లగూటి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కేవలం డైలాగులకే పరిమితం కాకుండా కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ అవసరాన్ని మరియు పునర్జన్మల వైవిధ్యాన్ని విజువల్‌గా ఆవిష్కరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను సమన్వయం చేసిన దర్శకుడు మణి తెల్లగూటి ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా మలిచారు. స్క్రిప్ట్ దశ నుంచే ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా డిజైన్ చేయడం ఆయన టెక్నికల్ నైపుణ్యాన్ని చాటుతోంది.
ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంలో పవన్ చెన్న అందించిన డార్క్ విజువల్స్, షాజీద్ హ్యుమాయన్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలాలుగా నిలిచాయి. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ టాలీవుడ్లో సరికొత్త చర్చకు దారితీసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

