Ashu Reddy | ఇటీవల వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా సెన్సేషన్ అషురెడ్డి తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక మిస్టరీ మ్యాన్ చేతిని పట్టుకుని, వేలికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఉన్న కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను ఆమె పోస్ట్ చేయగా, అవి కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో వరుడి ముఖం కనిపించకుండా కేవలం అతని చేతులు మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడటంతో, ఆ వ్యక్తి ఎవరై ఉంటారనే ఉత్కంఠ నెటిజన్లలో నెలకొంది.
మరోవైపు గతంలో కూడా అషురెడ్డి ఇలాంటి ప్రాంక్ వీడియోలు, ఫొటోషూట్లు ప్రమోషన్ల కోసం చేసిన సందర్భాలు ఉండటంతో, ఇది నిజంగానే నిశ్చితార్థమా లేక ఏదైనా టీవీ షో లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్ స్టంటా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు అషురెడ్డి ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వనప్పటికీ, ఈ మిస్టరీ పోస్ట్‌తో ఆమె మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.