Cinema news | బాగా చేశావ్.. మరి ఏంటి అంటూ ఏదో అడిగేవాళ్లు.. దానికర్థమేంటో తెలిసేది కాదంటున్న ‘ఛాంగురే బంగారురాజా’ భామ
“ఇది హీరోయిన్గా నా తొలిసినిమా. కరప్టడ్ కానిస్టేబుల్‌గా చేశాను. నా పాత్రలో హ్యూమర్‌తో పాటు లవ్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి’ అన్నారు గోల్డీ నిసీ. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న సినిమా ‘ఛాంగురే బంగారురాజా’.
Cinema news | “ఇది హీరోయిన్గా నా తొలిసినిమా. కరప్టడ్ కానిస్టేబుల్‌గా చేశాను. నా పాత్రలో హ్యూమర్‌తో పాటు లవ్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి’ అన్నారు గోల్డీ నిసీ. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న సినిమా ‘ఛాంగురే బంగారురాజా’. కార్తీక్ రత్నం హీరో. సతీశ్‌వర్మ దర్శకుడు. హీరో రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా గోల్డీ నిసీ విలేకరులతో మాట్లాడారు.
‘ఓ మెకానిక్ ఓ కానిస్టేబుల్ని ప్రేమలో పడేయడం తెరపై అద్భుతంగా చూపించారు దర్శకుడు. మెకానిక్‌గా కార్తీక్త్న్రం, కానిస్టేబుల్‌గా నేను. మా ఇద్దరి సన్నివేశాల్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్చేస్తారు’ అని చెప్పారు గోల్డీ. ఇంకా మాట్లాడుతూ-“ ఇంజనీరింగ్ చేసి, నటిని అవ్వాలని కలలు కన్నాను. షార్ట్ ఫిలింస్‌లో నటించాను. సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండేదాన్ని. కాస్టింగ్ కౌచ్ అనుభవాలు నాకేం ఎదురుకాలేదుగానీ, కొన్ని ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు మాత్రం ‘బాగా చేశావ్’ అంటూనే ‘మరి ఏంటి?’ అంటూ ఏదో అడిగేవాళ్లు. దానికర్థమేంటో తెలిసేదికాదు. అంతకుమించి నేను ఇబ్బందిపడ్డది లేదు. ఏదేమైనా అన్ని రకాల పాత్రలు చేయాలి. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇదే నా టార్గెట్” అని చెప్పుకొచ్చారు. గోల్డీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

