800 The Movie | ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ అప్డేట్.. 800 థియేటర్లలో సందడి చేసే టైం ఫిక్స్
800 The Movie | బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచేందుకు వస్తోంది లెజెండరీ క్రికెట్ ప్లేయర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran) బయోపిక్. 800 టైటిల్(800 Title)తో వస్తోన్న ఈ మూవీలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం మధుర్ మిట్టల్ (Madhurr Mittal) టైటిల్ రోల్ మురళీధరన్ పాత్ర నటిస్తున్నాడు.
800 The Movie | ఇప్పటికే సిల్వర్ స్క్రీన్‌పై స్టార్ క్రికెటర్ల బయోపిక్స్ సందడి చేశాయని తెలిసిందే. ఇదే జోనర్లో మరోసారి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచేందుకు వస్తోంది లెజెండరీ క్రికెట్ ప్లేయర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran) బయోపిక్. 800 టైటిల్(800 Title)తో వస్తోన్న ఈ మూవీలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం మధుర్ మిట్టల్ (Madhurr Mittal) టైటిల్ రోల్ మురళీధరన్ పాత్ర నటిస్తున్నాడు.
ఎంఎస్ శ్రీపతి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇటీవలే లాంఛ్ చేయగా.. మంచి స్పందన రాబట్టుకుంటోంది. మురళీధరన్ పాత్రలో జీవించేసినట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందని తెలియజేస్తూ.. న్యూ లుక్ ఒకటి విడుదల చేశారు. నెట్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మురళీధరన్ లుక్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్నిమూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగచారి నిర్మిస్తున్నారు. 800 పాన్ ఇండియా థ్రియాట్రికల్ రైట్స్‌ను శ్రీదేవి మూవీస్ బ్యానర్ అధినేత, పాపులర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad)దక్కించుకున్నట్టు సమాచారం. ఈ మూవీలో మహిమ నంబియార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఒకే ఒక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా అరుదైన రికార్డు మురళీధరన్ ఖాతాలో ఉందని తెలిసిందే. ఈ రికార్డు స్ఫూర్తితోనే సినిమాకు 800 టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
#MuthiahMuralidaran‘s #800TheMovie releasing WW on 6th October.@Murali_800 @GhibranVaibodha @Mahima_Nambiar @RDRajasekar @Cinemainmygenes @VivekRangachari @dirpitchumani @sampathdft @MovieTrainMP @krishnasivalenk @SrideviMovieOff @sonymusicsouth @PulagamOfficial pic.twitter.com/BjFXU5ZPFH
— Suresh PRO (@SureshPRO_) September 14, 2023
800 ట్రైలర్..
SACHIN TENDULKAR UNVEILS TRAILER OF MUTHIAH MURALIDARAN BIOPIC ‘800’… 6 OCT RELEASE… #SachinTendulkar unveiled the trailer of the #MuthiahMuralidaran biopic, titled 800 [#800TheMovie]… #SanathJayasuriya was also present at the event.
Trailer 🔗: https://t.co/e21A4LjQH2… pic.twitter.com/0zDMU3N3UH
— taran adarsh (@taran_adarsh) September 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

