Music School | బాలీవుడ్ స్టార్ నటుడు శర్మన్ జోషి (Sharman Joshi), హీరోయిన్ శ్రియా శరణ్ (Sriya Saran) ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా మ్యూజిక్ స్కూల్ (Music School). ఈ సినిమాకు మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు బియ్యాల (Paparao Biyyala) దర్శకత్వం వహించగా.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilayaraaja) సంగీతం అందించాడు. మే 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మ్యూజిక్ స్కూల్ (Music School) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
#MusicSchool (2023, Hindi) by @paparaobiyyala, ft. @shriya1109 @TheSharmanJoshi @prakashraaj @singer_shaan @gracy_goswami @ozubarua @MonaAmbegaonkar @SuhasiniMulay #BenjaminGilani & #LeelaSamson, now streaming on @PrimeVideoIN.@ilaiyaraaja pic.twitter.com/YXriQZIRqP
— CinemaRare (@CinemaRareIN) September 8, 2023
చదవులు ముఖ్యమా ? కళలు ముఖ్యమా? చిన్నతనంలో పిల్లలు ఎలా తమ కెరీర్‌ను ఎంచుకోవాలో మ్యూజిక్ స్కూల్(Music School) ఫిల్మ్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. పాపారావు బియ్యల డైరెక్ట్ చేసిన ఈ సినిమా పిల్లల్లో దాగిన ట్యాలెంట్‌ను వెలికి తీస్తుంది. కిడ్స్‌గా ఉన్నప్పుడు చదువుల కోసం పేరెంట్స్ పెట్టే టెన్షన్ తెలిసిందే. అకాడమిక్స్‌లో సూపర్ మార్క్స్ స్కోర్ చేయాలని తల్లితండ్రులు హైరానా పెడుతుంటారు. ఆ సమయంలో ఆటలు, పాటలు లాంటి ఎక్స్ట్రాకర్క్యూలర్ కార్యక్రమాలకు పిల్లల్ని దూరంగా పెడుతుంటారు. అయితే మ్యూజిక్ స్కూల్ చిత్రంలో కళలకు ప్రాధాన్యత ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, లీలా సాంసన్లు ప్రత్యేక పాత్రలు పోషించారు.