Love Story | ఆ వివాదం గురించి తెలియదు

“లవ్‌స్టోరి’ సినిమాకు నేను సమకూర్చిన పాటలు, నేపథ్యసంగీతానికి చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. తొలి సినిమాతోనే ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల అభిమానాన్ని చూరగొనడం ఆనందంగా ఉంది’ అని అన్నారు పవన్ సీహెచ్. ఆయన సంగీతాన్ని అందించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. నాగచైతన్య హీరోగా నటించారు. శేఖర్‌కమ్ముల దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. మంగళవారం పవన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ సినీనేపథ్యమున్న కుటుంబం మాది. మా తాత నాగేశ్వరరావు, నాన్న విజయ్‌కుమార్ సినిమాటోగ్రాఫర్స్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. వారి అడుగుజాడల్లోనే నేను పయనిస్తానని ఊహించలేదు. సంగీతంపై ఆసక్తితో ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో డిప్లొమాతో పాటు కంపోజింగ్ కోర్సు పూర్తిచేశా. రెహమాన్ బృందంలో చాలా సినిమాలకు పనిచేశా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘ఫిదా’కు నేను సంగీతాన్ని అందించాల్సింది. అనుభవం తక్కువగా ఉండటంతో నాకు అవకాశం లభించలేదు. శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ సినిమా చేస్తున్నారని తెలియగానే ఆయనకు ‘ఏ పిల్లా’ పాట డెమో ట్యూన్ పంపించా. ఆయనకు నచ్చడంతో సంగీతదర్శకుడిగా అవకాశం ఇచ్చారు. శేఖర్‌కమ్ములకు జాననద గీతాలంటే చాలా ఇష్టం. ‘సారంగదరియా’ పాటను మళ్లీ పునసృష్టించాలనే ఐడియా ఆయనదే. ఈ గీతంపై వచ్చిన వివాదం గురించి నాకు తెలియదు. ఆ సమయంలో రీరికార్డింగ్ కోసం చెన్నై వెళ్లాం. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమా కావడంతో నేపథ్య సంగీతాన్ని అందించడం చాలెంజింగ్‌గా అనిపించింది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ch pawan
- Love story movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

