Malavika Mohanan | ముంబై లోకల్ ట్రైన్లో నటి మాళవికాకు చేదు అనుభవం.. స్పందించిన ముంబై పోలీసులు
Mumbai Police | తంగలాన్, మాస్టర్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది నటి మాళవిక మోహనన్. అయితే ఈ నటి తనకు ముంబై లోకల్ ట్రైన్లో ఎదురైన ఒక చేదు అనుభవం గురించి తాజాగా పంచుకోగా.. దీనిపై స్పందించారు ముంబై పోలీసులు.
Malavika Mohanan – Mumbai Police | తంగలాన్, మాస్టర్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది నటి మాళవిక మోహనన్. అయితే ఈ నటి తనకు ముంబై లోకల్ ట్రైన్లో ఎదురైన ఒక చేదు అనుభవం గురించి తాజాగా పంచుకోగా.. దీనిపై స్పందించారు ముంబై పోలీసులు.
మాళవికా మోహనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కాలేజ్ డేస్‌లో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ముంబై లోకల్ ట్రైన్లో తన స్నేహితురాళ్లతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగిందని వివరించారు. మేము కూర్చున్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ దాదాపు ఖాళీగా ఉందని, అప్పుడు ఒక వ్యక్తి కిటికీ గ్రిల్‌కు దగ్గరగా వచ్చి, ఏక్ చుమ్మా దేగి క్యా? (ఒక ముద్దు ఇస్తావా?) అని అసభ్యంగా అడిగాడని మళావిక తెలిపారు. ఆ సమయంలో తాము ముగ్గురం పూర్తిగా నిస్సహాయంగా ఉండిపోయామని, ఏం చేయాలో తెలియక భయంతో వణికిపోయామని ఆమె పేర్కొన్నారు. సుమారు 10 నిమిషాల తర్వాత తదుపరి స్టేషన్ రావడంతో ప్రయాణికులు కంపార్ట్మెంట్లోకి రావడంతో తాము ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు.
అయితే ఈ సంఘటనపై ముంబై పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించారు. డియర్ మాళవిక గారు.. “మీరు మీ అనుభవాన్ని పంచుకోవడం, నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడం మేము చూశాం. ఇలాంటి అనుభవాలు షాకింగ్‌గా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయని మేము అర్థం చేసుకోగలం. కాబట్టి, పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా, నగరంలో ఏ ప్రదేశంలోనైనా మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే, దయచేసి 112/100 నంబర్లకు కాల్ చేయండి. మేము వీలైనంత త్వరగా సహాయం అందిస్తాము. ఫిర్యాదు చేయకపోవడం వల్ల నేరస్థులు మరింత ధైర్యం పొందుతారు అని పోలీసులు తెలిపారు. ముంబై నగరం మహిళలకు ఎప్పుడూ సురక్షితమైనది, దానిని మరింత మెరుగుపరచడానికి మేము ఎటువంటి ప్రయత్నం వదిలిపెట్టము. ఒకసారి ఫిర్యాదు చేస్తే, నేరస్థుడిని చట్ట ప్రకారం తగిన విధంగా శిక్షిస్తామంటూ ముంబై పోలీసు విభాగం తెలిపింది.
Ms @MalavikaM_
We came across an article in an online portal of a newspaper, which you shared your experince and raised concern over women safety in the city. We can imagine that experiences like these can be startling and leave a long term impact.
Thus we must reiterate…
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) June 14, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

