అగ్ర హీరోలు వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఈ నెల 22న లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని అనిల్ రావిపూడి స్టార్ట్ చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ లాంగ్ షెడ్యూల్లో వెంకటేష్, కల్యాణ్రామ్లపై కామెడీ సీన్స్‌తో పాటు ఓ పాటను కూడా షూట్ చేస్తారట. అంతేకాక, ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కథలోని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లోనే చిత్రీకరిస్తారని వినికిడి.
ఈ సినిమాలో వెంకటేష్ అల్ట్రా ైస్టెలిష్ లుక్‌లో కనిపిస్తారట. ఆ లుక్‌కి పూర్తి భిన్నంగా కల్యాణ్‌రామ్ లుక్ ఉంటుందని సమాచారం. కుటుంబ భావోద్వేగాలు, కామెడీ ఎలిమెంట్స్ మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తున్నది. నవంబర్‌లోపు షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. కీర్తి సురేశ్, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘జనవరి 13న విడుదల’అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మాత.