The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
The Greatest Trailer | బాక్సింగ్ ప్రపంచంలో చరిత్ర సృష్టించిన దిగ్గజం మొహమ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ వెబ్ సిరీస్ 'ది గ్రేటెస్ట్' (The Greatest).
The Greatest Trailer | బాక్సింగ్ ప్రపంచంలో చరిత్ర సృష్టించిన దిగ్గజం మొహమ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ వెబ్ సిరీస్ ‘ది గ్రేటెస్ట్’ (The Greatest). ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ 04 నుంచి స్ట్రీమింగ్ కాబోతుండగా తాజాగా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘క్రీడ్’ చిత్రాల ఫేమ్ మైఖేల్ బి. జోర్డాన్ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.
మొహమ్మద్ అలీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య లోనీ అలీ అధికారిక అనుమతితో రూపొందుతున్న మొట్టమొదటి స్క్రిప్టెడ్ సిరీస్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్‌లో అలీ (కాసియస్ క్లే) ప్రధాన పాత్రను యువ నటుడు జాలెన్ బెస్ట్ పోషిస్తుండగా, మైఖేల్ ఈలీ (మాల్కం ఎక్స్ పాత్రలో), ఒమారి హార్డ్‌విక్, అమిన్ జోసెఫ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్ వాట్కిన్స్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్ కేవలం బాక్సింగ్ రింగ్‌లోని విజయాలనే కాకుండా, 1960లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించినప్పటి నుండి 1964లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా ఎదిగే వరకు ఆయన సాగించిన ప్రయాణాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సామాజిక పోరాటాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

