MS Dhoni – Yogibabu | తమిళ చిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది లీడింగ్ కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యోగిబాబు (Yogi Babu). స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ లీడింగ్ పొజిషన్లో కొనసాగుతున్నాడీ టాలెంటెడ్ యాక్టర్. ఈ మధ్యే ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (Lets Get Married) అనే తమిళ సినిమాలో కీ రోల్ పోషించాడు. ఇక ఈ సినిమాకు టీంఇండియా (Team India) మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) భార్య సాక్షి నిర్మాతగా వ్యవహరించింది. జూలై 28న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా టైంలోనే యోగిబాబు, ఎంఎస్ ధోనీ మంచి స్నేహితులు అయ్యారు.
ఇక అప్పట్లో తనను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టులోకి తీసుకోవాలంటూ యోగిబాబు ధోనీని అడిగిన విషయం తెలిసిందే. దీనికి ధోనీ సమాధానమిస్తూ.. ‘అంబటి రాయుడు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఆ ప్లేస్ లోకి తప్పకుండా మిమ్మల్నే తీసుకుంటాను. ఈ విషయంపై జట్టు యాజమాన్యంతో మాట్లాడతాను. అంటూ నవ్వులు పూయించారు.
ఇదిలా ఉండగా.. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిశారు. ఒక యాడ్ షూటింగ్లో భాగంగా యోగిబాబు ఎంఎస్ ధోనీని కలువగా.. దీనికి సంబంధించిన ఫొటోలను యోగిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.
— Yogi Babu (@iYogiBabu) October 18, 2023