Mrunal Thakur | వర్క్‌లో బిజీగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నా: మృణాల్ ఠాకూర్
మరాఠీ భామ మృణాల్ ఠాకూర్‌ను అదృష్ట నాయికగా అభివర్ణిస్తున్నారు. తొలుత మాతృభాషలో, ఆ తర్వాత హిందీలో సినిమాలు చేసినప్పటికీ ఆశించిన గుర్తింపును సంపాదించుకోలేకపోయిందీ భామ.
Mrunal Thakur | మరాఠీ భామ మృణాల్ ఠాకూర్‌ను అదృష్ట నాయికగా అభివర్ణిస్తున్నారు. తొలుత మాతృభాషలో, ఆ తర్వాత హిందీలో సినిమాలు చేసినప్పటికీ ఆశించిన గుర్తింపును సంపాదించుకోలేకపోయిందీ భామ. తెలుగులో అరంగేట్ర చిత్రం ‘సీతారామం’తోనే ఈ అమ్మడి దశ తిరిగింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నది. విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది మృణాల్. గత రెండేళ్లుగా విరామం లేకుండా పనిచేస్తున్నానని, ఒక్కోసారి నిద్రకు కూడా సరైన సమయం ఉండటం లేదని చెప్పింది.
‘నా ఫ్యామిలీతో గడపడానికి కూడా సమయం చిక్కడం లేదు. అయితే వర్క్‌లో బిజీగా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ప్రతి సినిమాలో నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమై కథలను ఎంచుకొని ప్రయాణం సాగిస్తున్నానని, మంచి పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలన్నదే తన అభిమతమని మృణాల్ ఠాకూర్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

