దసరా సక్సెస్‌లో ఫుల్ జోష్ మీదున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). దసరా సక్సెస్ అందించిన ఉత్సాహంతో కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. నాని డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ఇచ్చాడని తెలిసిందే. నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
సీతారామంలో అద్బుతమైన నటనతో కోట్లాదిమంది మనసు దోచేసిన ఈ భామ తన ఫాలోవర్లు, అభిమానులకు ఓ సందేశాన్ని షేర్ చేసింది. మీ ప్రేమాభిమానాలు, మద్దతు, ఆశీస్సులకు ధన్యవాదాలు. నాని 30లో నటిస్తుండటం చాలా చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది. మీ సీత.. లవ్ యూ ఆల్.. అంటూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఫిలింనగర్ సర్కిల్ టాక్ ప్రకారం ఈ మూవీ గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది.
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని 30 ఉండబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఈ చిత్రంలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సను జాన్ వర్గీస్ ఐఎస్సీ ఈ సినిమాకు కెమెరామెన్ కాగా.. మలయాళం కంపోజర్, హృదయం ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం సమకూరుస్తున్నాడు.
❤️ @mrunal0801 #MrunalThakur #Nani30 pic.twitter.com/QqXIQCUlUz
— Mrunal Thakur🦋 (@MrunalStann) April 9, 2023
నాని 30 గ్లింప్స్ వీడియో..